తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలంతా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమైన మీటింగు కొరకు భేటి కావడం జరిగింది. ఈ మీటింగులో ముఖ్యంగా తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నిక కాబట్టే దిల్ రాజు, రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జున, వెంకటేష్, బోయపాటి శ్రీను, శివ బాలాజీ, త్రివిక్రమ్, బాబి కొల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ, మైత్రి రవి తదితరులు ఈ మీటింగ్ కోసం హాజరు కావడం జరిగింది. ఈ మీటింగులో ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలన్నీ మాట్లాడుతూ చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ మీటింగ్ జరుగుతుంది. టికెట్ రేట్ల విషయాలను, అలాగే బెనిఫిట్ షో సంబంధించిన కీలక అంశాలను ఈ మీటింగ్ లో చర్చించినట్లు కనిపిస్తుంది. ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు అఫీషియల్ గా రానున్నవి.