ఒక స్టార్ హీరో సినిమాకీ కథ చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా అనుకున్నంత తొందరగా సెట్స్ పైకి రాదు. కొన్నిసార్లు షూటింగ్ పూర్తయినా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఎదురవుతోంది. అందుకే ప్రాజెక్ట్ అంత రెడీ అనుకున్నాకనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇస్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ సెట్స్ పైకి వచ్చింది అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా బన్నీ వద్దకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
2017లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ ఒక ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. జనతా గ్యారేజ్ హిట్టయిన సంతోషంలో ఇద్దరు మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ ని కూడా ఫిక్స్ చేశారు. కానీ కాంబినేషన్ ఎందుకో మళ్ళీ తెరపైకి రాలేదు. అయితే అదే నిర్మాతలతో ఇప్పుడు కొరటాల శివ బన్నీతో ఒక సినిమా చేస్తున్నాడు. బహుశా తారక్ తో చేయాలని అనుకున్న కథను బన్నీకి షిఫ్ట్ చేశారా అనే టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.