మహేష్ లిప్ లాక్ కి అడ్డు చెప్పిన నమ్రత

సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఏడాది మంచి బాక్సాఫీస్ ని అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను మళ్ళీ సంక్రాంతికి రెడీ చేయాలని గట్టిగానే ప్లాన్ వేశార. కానీ కరోనా కారణంగా కాస్త ఇబ్బందులు తప్పలేవు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఇక షూటింగ్ పూర్తిగా కరోనా అదుపులోకి వచ్చిన తరువాతే స్టార్ట్ చేయాలని మహేష్ డిసైడ్ అయ్యాడు. ఇకపోతే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై నమ్రత అభ్యంతరం చెప్పడంతో దర్శకుడు సీన్స్ ని కట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లిప్ లాక్ సీన్స్ కి అవకాశం ఉందని ముందుగానే స్క్రిప్ట్ ని పూర్తిగా వినిపించిన దర్శకుడు ఇప్పుడు మళ్ళీ నమ్రత చెప్పిన కారణంగా మార్పులు చేయక తప్పడం లేదని తెలుస్తోంది. గతంలో కొన్ని సినిమాల్లో మహేష్ లిప్ లాక్ సీన్స్ లో నటించగా అవి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు కూడా అలానే అనుకోని దర్శకుడు సీన్స్ క్రియేట్ చేయగా నమ్రత అడ్డుపడినట్లు టాక్.