నందమూరి హీరోను లైన్ లో పెడుతోన్న అనిల్ రావిపూడి

Balakrishna

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న కమర్షియల్ దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని పెద్ద హీరోల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలందరు బిజీగా ఉన్నారు. అలాగే కరోనా వైరస్ కారణంగా మరో ఏడాది వరకు డేట్స్ కూడా దొరికే ఛాన్స్ లేదు. అందుకే కాస్త అందుబాటులో ఉన్న నందమూరి హీరోతోనే వర్క్ చేయాలని అనుకుంటున్నాడు.

ఆ హీరో మరెవరో కాదు. మన బాలయ్య బాబే. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ తో ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ పూరి జగన్నాథ్, బి.గోపాల్ వంటి వారు రెడీగానే ఉన్నారు. అయితే వారి కంటే ముందే బాలకృష్ణతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ పై అనిల్ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.