ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ ఉంటుంది హీరోయిన్ తాప్సి. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ భామ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో అవమానకర పరిస్థితులను చూశానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో దురదృష్టవంతురాలిగా తనపై ఓ మార్క్ ఉండేదని, నిర్మాతలు వారి సినిమాలకు తాను సంతకం చేయడాన్ని సిగ్గుచేటుగా భావించేవారని తాప్సి చెప్పింది.

మొదట్లో అంత అందంగా లేకపోవడం వల్ల ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాన్ని చెబుతోంది. కొంతమంది హీరోల సరసన నేను నటించడం వారి భార్యలకు సిగ్గుచేటుగా భావించి నా స్థానంలో మిగతా హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారంది. హీరో మునుపటి చిత్రాలు సరిగా ఆడకపోవడం వల్ల వారి బడ్జెట్ కంట్రోల్ చేసుకునేందుకు నా రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవాలని చెప్పిన రోజులు కూడా ఉన్నాయంది.
ఓ హీరోయిన్గా లేడీ ఓరియంటేడ్ సినిమాలు చేయడం వల్ల హీరోలు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు వెనకడతారు. అయితే ఇది కష్టమైనదే. కానీ దీనివల్ల నేను సంతోషంగా ఉంటున్నాను అని తాప్సీ తెలిపింది.