అవును.. ఆ అబ్బాయితో ఎప్పటినుంచో రిలేషన్‌షిప్‌లో ఉన్నానన్న తాప్సి

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా హీరోయిన్‌గా రాణించింది తాప్సి పన్ను. ప్రస్తుతం “హసీన్ డిల్లరుబా”, “రష్మీ రాకెట్” సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే తన వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టడానికి తాప్సి అసలు ఇష్టపడదు. కానీ తాజాగా తన రిలేషన్ షిప్ గురించి తాప్సి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

TAPSEE PANNU

బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాను ఎప్పటినుంచో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, కానీ బయట చాలా తక్కువసార్లు తిరిగామని తాప్సి చెప్పింది. తాను ఎప్పుడైనా అతని గురించి మాట్లాడితే నాకంటే అతడు గురించి మీడియాలో ఎక్కువ వార్తలు వస్తాయంది. ఇది తన ప్రొఫెషనల్ జీవితానికి అడ్డంకిగా నిలుస్తోందంది. తమ రిలేషన్ గురించి అబ్బాయి కుటుంబానికి తెలుసని, మా ఇంట్లో కూడా ఈ విషయం చెప్పానంది.

ఒక బ్యాడ్మింటన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడిని తొలిసారి చూశానని, ఆ సమయంలో అతడిపై ఇష్టం కలిగిందని తాప్సి చెప్పింది. ఆ తర్వాత ట్విట్టర్‌లో కాసేపు మాట్లాడుకున్నామని, తర్వాత వీలు చూసుకుని బయట కలిశామంది. ప్రస్తుతం తమ మధ్య సంతోషకరమైన రిలేషన్ కొనసాగుతోందని, మా రిలేషన్ షిప్ ఎవరికీ భారంగా లేదని తాప్సి వెల్లడించింది.