బాలయ్య ఎక్కడా తగ్గట్లేదుగా.. ఒకేసారి ముగ్గురితో రోమాన్స్

నందమూరి నటసింహం బాలక‌ృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న BB3లో మరో హీరోయిన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే హీరోయిన్ పూర్ణ, అఖిల్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సయేషాను బాలయ్య సరసన హీరోయిన్‌గా తీసుకున్నారు.

BALAKRISHNA

తాజాగా ప్రగ్యా జైస్వాల్‌ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. జయ నాయకి నాయక సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

2021 సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫార్మ్ అవ్వలేదు