ఈ ఏడాది అన్ని సినిమా ఇండస్ట్రీలలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా బారిన పడి కొంతమంది మరణించగా.. మరికొంతమంది అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచారు. దీంతో ఎంతోమంది నటులను సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో పలువురు చనిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.
తమిళ స్టార్ నటుడు అరుణ్ అలెగ్జాండర్ తాజాగా గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. తన నటనతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో సినీ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో ‘ఖైదీ’ సినిమాలో తన నటనతో అరుణ్ అలెగ్జాండర్ మంచి పేరు సంపాదించుకున్నారు. విజయ్ హీరోగా వస్తున్న ‘మాస్టర్’ సినిమాలో కూడా ఆయన నటించారు. సంక్రాంతి కానుకగా ‘మాస్టర్’ సినిమా విడుదల కానుంది. మనరం, కోలమావు కోకిలా, ఖైదీ, బిగిల్ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అరుణ్.. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత నటుడిగా మారారు.