అతడితో అమితాబ్ మనవరాలు లవ్ ఎఫైర్

బాలీవుడ్‌లో లవ్ ఎఫైర్స్ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. హీరో,హీరోయిన్ల మధ్యనే కాదు.. హీరో, హీరోయిన్ల కుమార్తెలు, మనవరాళ్ల లవ్ ఎఫైర్స్ కూడా మీడియాలో హాల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనవరాలు నవ్య నవేలి లవ్ ఎఫైర్ న్యూస్ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జవెద్ జాఫ్రీ కుమారుడు మీజాన్ జాఫ్రీతో నవ్య నవేలి డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

Navya Naveli boyfriend

వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో అనేకసార్లు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను స్వయంగా నవ్య నవేలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అప్పటినుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అనేకసార్లు మీజాన్‌ను ప్రశ్నించగా.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, డేటింగ్ లాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పాడు. నవ్యకు, తనకు మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందన్నాడు.

కలిసి తిరిగినంత మాత్రాన డేటింగ్ అనుకోవ్దదని సూచించాడు. అయితే తాజాగా మళ్లీ మీజాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను నవ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఇంకా నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమితాబ్ మనవరాలు కావడంతో.. మీడియాలో ఈ వార్త ఇప్పుడు హాల్‌చల్ చేస్తుంది.