కరోనాను జయించిన రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలిపింది. తాజాగా టెస్టు చేయించుకోగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని అభిమానులకు చెప్పింది. తాను త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని రకుల్ స్పష్టం చేసింది.

RAKUL CORONA NEGATIVE

మంచి ఆరోగ్యం , అనుకూలతతో 2021 సంవత్సరంను ప్రారంభించడానికి వేచి ఉండలేము అని రకుల్ తెలిపింది. అందరూ బాధ్యతగా ఉండాలని, మాస్కులు ధరిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రకుల్‌కి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంది.

ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫొటోలను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరింత స్ట్రాంగ్‌గా తయారయ్యేందుకు చిన్న చిన్న వ్యామాయాలు చేస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఏడు సినిమాల్లో రకుల్ నటిస్తోంది.