టాలెంటెడ్ యాక్టర్ టర్న్డ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘తిమ్మరుసు: అసైన్మెంట్ వాలి’. కన్నడలో 2019లో వచ్చిన సూపర్ హిట్ అయిన బీర్బల్ ట్రైయాలజి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని సినిమాకి తిమ్మరుసు రీమేక్. ట్యాక్సీవాలా సినిమాతో మంచి డెబ్యు ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ తిమ్మరుసులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్.ఒరిజినల్స్ బ్యానర్లు ఈ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 30న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడ్డ ధియేటర్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. పోస్ట్ సెకండ్ వేవ్, ధియేటర్ లో రిలీజ్ అవనున్న మొదటి సినిమా తిమ్మరుసు. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, ”ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని అనుకుంటున్న టైమ్‌లో ‘తిమ్మరుసు’ కథ విన్నాను. నచ్చింది. నిర్మాతలు మహేశ్, సజన్తో మాట్లాడిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యింది. దర్శకుడు శరణ్ అద్భుతంగా తెరకెక్కించాడు. అప్పూ ప్రభాకర్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. ప్రియాంక జవాల్కర్ వండర్ఫుల్ కోస్టార్. చరణ్ ఎక్స్లెంట్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈనెల 30న మా చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.
‘ఈ చిత్రాన్ని చాలా ఛాలెంజింగ్ పరిస్థితుల్లో షూట్ చేశాం. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. లాయర్ పాత్రలో సత్యదేవ్ లుక్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో సినిమాని దర్శకుడు శరణ్ శరవేగంగా పూర్తి చేశారు. ఈ చిత్ర టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. ఈనెల 30న థియేటర్స్‌లో విడుదలయ్యే మా సినిమా కచ్చితంగా బెస్ట్ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుంది’ అని నిర్మాత మహేష్ కోనేరు చెప్పారు.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ, ‘శ్రీకష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాలు చేయడమే కాదు.. మంచి నిజాయతీగల వ్యక్తి. అలాంటి ఇంటెలిజెంట్ అయిన లాయర్ పాత్రలో సత్యదేవ్ చేస్తున్న డిఫరెంట్ అటెంప్ట్ ఈ సినిమా. నిర్మాతలు మహేష్ కోనేరు, సజన్ ఎంతో సపోర్ట్ చేశారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక జవాల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, వైవా హర్ష, అంకిత్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.