రంగమత్త ‘పుష్ప’ రాజ్ ని కలిసింది…

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమా రంగస్థలం. అప్పటివరకూ ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ చెరిపేసిన ఈ కమర్షియల్ సినిమాలో యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ స్పెషల్ రోల్ లో కనిపించింది. రంగమత్తగా నటించిన అనసూయ, రంగస్థలం సినిమాకి ఎక్స్ట్రా గ్లామర్ కి యాడ్ చేస్తూనే ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. అనసూయ కెరీర్ నే ఈ పాత్ర మలుపుతిప్పింది. ఆమె సినిమా కెరీర్ గురించి చెప్పాలి అంటే బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం అనొచ్చు. అంతలా పేరు తెచ్చిన ఆ పాత్ర తర్వాత అనసూయ ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది. సుకుమార్, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో అనసూయ స్పెషల్ రోల్ లో కనిపించబోతోంది. విలన్‌గా మలయాళ నటుడు ఫహద ఫాసిల్‌, హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ మొదలయ్యింది.

ఇప్పటికే షూటింగ్‌లో అల్లు అర్జున్‌, రష్మికలు పాల్గొనగా తాజాగా అనసూయ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ‘బ్యాక్‌ టూ వర్క్‌’ అంటూ ‘పుష్ప’ షూటింగ్‌ లోకేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. రంగమత్త పాత్రలాగే పుష్పలో అనసూయ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందట. ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్ హైదరబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదారాబాద్ షెడ్యూల్ అవగానే పుష్ప టీమ్ గోవా వెళ్లనున్నారు. అక్కడ షెడ్యూల్‌ 15 రోజుల పాటు పుష్ప షూటింగ్ జరగనుంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘పుష్ప’ సినిమా తొలి పార్ట్‌ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.