“థక్త్” మొదలవుతోంది…

బాహుబలి తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వార్ బేస్డ్ పీరియాడికల్ ఫిల్మ్స్ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ కరణ్ జోహార్ “థక్త్” పేరుతో ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే అనౌన్స్ అయిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, అలియా భట్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా కరీనా కపూర్, విక్కి కౌశల్,అనిల్ కపూర్,జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్ లాంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజానికి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఈ పాటికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా, మిగిలిన భారీ బడ్జట్ చిత్రాల రిజల్ట్ చూశాక జాగ్రత్త పడిన చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పక్కాగా ప్లాన్ జరిగేలా చూస్తున్నారు.

రణ్వీర్ సింగ్, అలియా భట్ ముంబైలోని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్లి ఆయనని కలవడం జరిగింది. దీంతో థక్త్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఇప్పటికే అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో, రణ్వీర్ 83లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండగానే, త్వరలోనే థక్త్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుందని సమాచారం.