మెగాస్టార్ నటించిన సైరా సినిమా అన్ని ఏరియాల నుంచి హిట్ టాక్ తెచ్చుకోని హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. చిరుని రెండేళ్ల తర్వాత తెరపై చూడడానికి తెలుగు సినీ అభిమానులంతా థియేటర్స్ దగ్గర క్యూలు కట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్లని రాబట్టింది. మెగాస్టార్ కెరీర్ లోనే మాత్రమే కాకుండా ఎంటైర్ తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం చాలా అరుదు. ఒక అరవై ఏళ్ల వ్యక్తితో వీరుడి కథ తీశారని అంటున్నారు. నిజానికి అది అరవై ఏళ్ల వ్యక్తి తీసిన సినిమా కాదు, ఒక సినీ చరిత్ర మరో వీరుడి చరిత్ర గురించి చేసిన సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టిస్తున్న సినిమా ఇది.
ముఖ్యంగా బీ సీ సెంటర్స్ లో మెగాస్టార్ మ్యానియా రీసౌండ్ లా వినిపిస్తోంది. ముసలి ముతక అనే తేడా లేకుండా చిరు చూడడానికి వెళ్తున్నారు. పండగ సెలవలు ఉన్నాయి కాబట్టి సైరా సినిమా ఫస్ట్ డే వీకెండ్ లోనే లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఇంత భారీ బడ్జట్ తో తెరకెక్కి, ఫస్ట్ వీకెండ్ లోనే ప్రాఫిట్స్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం అంటే అది కేవలం చిరుకి, చిరు సినిమాకి మాత్రం సాధ్యం. అయినా ఈ జనరేషన్ వాళ్లకి చిరు వినడం తప్ప చూసి ఉండరు. 90ల్లో సినిమా థియేటర్స్ దగ్గర తెగిన టికెట్ల కన్నా ముందే చిరిగిన చొక్కాలు చెప్తాయి ఆయన రేంజ్ ఏంటో. ఇప్పుడు సైరా సినిమా ప్రభంజనంతో ఈ జనరేషన్ సినీ అభిమానులు కూడా ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో చూస్తారు.