ఆ మార్క్ టచ్ చేసిన 50వ సినిమా సైరా

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. ఓవ‌ర్‌సీస్ విష‌యానికి వ‌స్తే.. బుధ‌వారం రోజున 850k డాల‌ర్స్‌పైగా క‌లెక్ష‌న్స రాబ‌ట్టుకున్న ఈ హిస్టారిక‌ల్ మూవీ.. గురువారం ఉద‌యానికి వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ మార్క్ ను క్రాస్ చేసింది. చిరంజీవికి వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ సాధించిన రెండో చిత్ర‌మిది. ఇప్పటి వరకూ తెలుగు నుంచి 50 సినిమాలు వన్ మిలియన్ క్లబ్ లో చేరాయి. అయితే దసరా సీజన్ కావడం, పైగా లాంగ్ వీకెండ్ కలిసి రావడం సైరా సినిమాకి ప్రధాన బలం. హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని ఏరియాల్లో హిట్ టాక్ తెచ్చుకోని మంచి ఓపెనింగ్స్ రాబట్టిన సైరా లాంగ్ రన్ లో చాలా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.