బోయపాటి కథ కోసం బాలయ్య బరువు తగ్గుతున్నాడా?

ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న నందమూరి బాల‌కృష్ణ, ఇది అయిపోగానే బోయపాటి సినిమాని లైన్ లో పెట్టాడు. సింహా, లెజెండ్‌ చిత్రాల త‌ర్వాత హ్యాట్రిక్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నిజానికి బడ్జట్ కారణంగా ఆగిపోయింది అనుకున్న ఈ సినిమాని మొదలు పెడుతున్నట్లు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రీప్రోడుక్షన్ వర్క్ కంప్లీట్ కాగానే డిసెంబ‌ర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో లాగానే ఇందులో కూడా బాల‌కృష్ణ రెండు కోణాల్లో ఆవిష్క‌రించ‌నున్నాడ‌ట బోయ‌పాటి. అందులో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం బ‌రువు త‌గ్గుతున్నాడ‌ట‌.

బాల‌కృష్ణ‌. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 25 కిలోలు బ‌రువు త‌గ్గుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బ‌రువు త‌గ్గ‌డం కోసం బాల‌కృష్ణ జిమ్‌లో ప్ర‌తిరోజూ 5 గంట‌ల పాటు క‌ష్ట‌పడుతున్నాడ‌ని సమాచారం. ఇప్ప‌టికే ఈయ‌న 15 కిలోలు త‌గ్గార‌ని స‌మాచారం, సెట్స్ పైకి వెళ్లే సమయానికి బాలయ్య పూర్తి ఫిట్ గా అవుతాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బోయపాటి సినిమా అయ్యాక పూరితో మూవీ కమిట్ అయిన బాలకృష్ణ, అది సెట్స్ పై ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు ఉన్నాయి. మరి నాలుగులో సారి సెట్ అవుతున్న ఈ కాంబినేషన్ హిస్టారికల్ కథతో వస్తారా లేక కంప్లీట్ కమర్షియల్ కథతో వస్తారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.