రెండు టిప్పర్లు కొట్టుకుంటే ఇలానే ఉంటుంది

ఇండియన్ యాక్షన్ హీరోస్ హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన మొదటి సినిమా వార్. ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్ రేంజులో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రెండు టిప్పర్లు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుసుకోవచ్చని సినీ అభిమానులు అంటున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసిన యాక్షన్ సీక్వెన్సెస్ వార్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. హ్రితిక్ ధూమ్ 2 తర్వాత అంత స్టైలిష్ గా కనిపించడం ఇదే మొదటి సారి కావడంతో ఆడియన్స్ వార్ సినిమాకి బాగా లైక్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గాంధీ జయంతి నాడు రిలీజ్ అయిన వార్ సినిమా మొదటిరోజు కేవలం హిందీలోనే 53 కోట్లు రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. 2019లో రిలీజ్ అయిన అన్ని సినిమా రికార్డులని వార్ క్లియర్ చేసి తనపై రాసుకుంది. ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరుస్తూ వార్ సినిమా వసూళ్ల పరంపర కొనసాగుతుంది. ఇదే జోష్ లాంగ్ రన్ లో కూడా వార్ బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యం లేదు. నేషనల్ హాలిడే రోజు కలిసి రావడం కూడా వార్ సినిమాకి కలిసొచ్చింది, ఓవర్సీస్ లో కూడా వార్ డ్రీం రన్ ని గట్టిగానే స్టార్ట్ చేసింది. మొత్తానికి వార్ సినిమాతో టైగర్ ష్రాఫ్, హ్రితిక్ రోషన్ బాలీవుడ్ మేకర్స్ కి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. మరి ఫస్ట్ వీకెండ్ కి వార్ ఎంత రాబడుతుందో చూడాలి.