షూట్ స్టార్ట్ అయ్యాకే అసలు జాతర మొదలయ్యేది

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్, టీజర్ వస్తుందని చాలా వెయిట్ చేశారు… కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో పూర్తి చేసుకుకుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మొదలు పెట్టిన సెకండ్ షెడ్యూల్ కి కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రం 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కార్ వారి పాట షూటింగ్ స్టార్ట్ అవగానే అప్డేట్స్ బయటకి వస్తాయి అని అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మహేష్ బాబు పుట్టున రోజు (ఆగష్టు 9)న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఆగస్ట్ 9 నుంచి సర్కారు వారి పాట కాదు ఏకంగా సర్కారు వారి జాతరనే మొదలవనుంది. ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికి సిద్దమవ్వండి.