వారసుడు వస్తున్నాడు… సిద్దం అవ్వండి…

61వ పుట్టిన రోజు జరుపుకున్న నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరు పండగ చేసుకొనే వార్త చెప్పారు. నటసింహం వారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ వార్త దాటేస్తూ వస్తున్న బాలయ్య మొత్తానికి తన పుట్టిన రోజున మోక్షజ్ఞ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఆదిత్య 369 సీక్వెల్‌లో అబ్బాయి, నేను కలిసి నటిస్తాం. ‘తాతమ్మ కల’ వంటి పలు సినిమాల ద్వారా నాన్నగారు నాకు నటనలో మెళకువలు నేర్పించాడు. అలా నేను మోక్షజ్ఞను నా సినిమాతో పరిచయం చేస్తూ మెళకువలు నేర్పిస్తాను. ఈ సినిమాకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. దానికి స్టోరీ బోర్డ్ సైతం రెడీ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోందని” తెలిపారు. ఇక ఈ సినిమాకు బాలయ్యే అన్ని దగ్గరుండి చూసుకొంటున్నాడు. మాటలు, స్క్రీన్ ప్లే బాలయ్య పర్యవేక్షించడం విశేషం. ఏదిఏమైనా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నటసింహం నట వారసుడు ఎట్టకేలకు తన మొదటి సినిమాను తండ్రి తోనే కలిసి నటించడమంటే గొప్ప విషయమే.. ఇక ఒకేసారి వెండితెరపై బాలయ్యబాబును, మోక్షజ్ఞను చూసిన ఫ్యాన్స్ కి పూనకాలే.