సింగర్ సునీత రెండో పెళ్లిలో ట్విస్ట్?

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనితో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. త్వరలో వీరి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 27న సునీత, రామ్ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్తలొచ్చాయి. కానీ ఈ లోపు మరో వార్త బయటికొచ్చింది. వారి పెళ్లి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల వచ్చే ఏడాదికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

SUNITHA

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వీరి పెళ్లి వాయిదా పడటానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలి.

సునీతకు 19 ఏళ్ల వయస్సులో కిరణ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే మనస్పర్థలు రావడంతో కొద్దిరోజులకు వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత పిల్లలను పెంచుకుంటూ ఒంటరిగా ఉంది సునీత. అయితే పిల్లలు, బంధువుల కోరిక మేరకు ఇప్పుడు 43 ఏళ్ల వయస్సులో సునీత రెండో పెళ్లికి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత.. డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్‌గా కూడా పనిచేసింది.