టీజర్ వచ్చేది అప్పుడే…

రీసెంట్ గా నిను వీడని నీడను నేను లాంటి డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులని అలరించి, హిట్ అందుకున్న సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. కామెడీని, కన్ఫ్యూషన్ ని కలిపి కొట్టి హిట్స్ అందుకునే జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఈ మూవీతో సందీప్ కిషన్ తనలోని కామెడీ యాంగిల్ ని కంప్లీట్ గా బయటకి తీసి, మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ పోస్టర్స్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది, ఇప్పుడు చిత్ర యూనిట్ తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ మూవీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 15న తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హన్సిక మోత్వానీ నటిస్తుండగా, రాధికా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం.