సినిమాలకి అతీతం, ఈ స్నేహం

ప్రభాస్ గోపీచంద్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే, అలాగే ప్రభాస్ అల్లు అర్జున్ కూడా మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సినిమాలతో సంబంధం లేకుండా ప్రభాస్, ఈ ఇద్దరి హీరోలతో క్లోజ్ గా ఉంటాడు. అందుకే బయట ఫంక్షన్స్ కి పెద్దగా రాని ప్రభాస్, గోపీచంద్ చిన్న కొడుకు వియాన్ మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై సందడి చేశాడు. ఇదే వేడుకకి అల్లు అర్జున్ కూడా రావడంతో సెలెబ్రేషన్స్ మరింత కలర్ఫుల్ అయ్యాయి.

హైదరాబాద్ లోని గోపిచంద్ ఇంట్లో నిన్న రాత్రి జరిగిన బర్త్ డే వేడుకలో ప్రభాస్, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ బర్త్ డే ఈవెంట్ నుంచి బయటకి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అభిమానులని ఖుషి చేస్తున్నాయి.