రెండోది ఏమయ్యిందో కానీ… మూడోది మాత్రం మొదలవుతోంది…

అజయ్ భూపతి, రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు. మొదటి సినిమా RX 100తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన అజ‌య్ భూప‌తి, మరో సినిమాకి ఇప్పటి వరకూ సైన్ చేయలేదు. మధ్యలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనే వార్త వచ్చినా కూడా అవేమి మెటీరియలైజ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం, అజయ్ భూపతి తన సెకండ్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ జరుపుకుంటుండగానే మూడో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత‌గా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో న‌టిస్తాడని చిత్ర నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆ హీరో ఎవరు? అజయ్ భూపతి ఎలాంటి కథతో సినిమా చేస్తున్నాడు? ఎప్పుడు మొదలుపెడుతున్నాడు అనేది తెలియాలంటే మ‌రికొన్నిరోజులు ఆగాల్సిందే.