పుష్ప సినిమాలో ఎమోషనల్ టచ్

allu arjun

దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ ఆర్య, ఆర్య 2 వంటి ప్రేమకథలతో ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి వీరిద్దరూ సరికొత్త ఎమోషనల్ స్టోరీతో వస్తున్నారు. పుష్పలో అల్లు అర్జున్‌ను లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. బన్నీ పవర్ఫుల్ మరియు అల్ట్రా మాస్ లుక్ ఇప్పటికే మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

తండ్రి మనోభావాల చుట్టూ కథను అల్లి నాన్నకు ప్రేమతో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ద్వారా సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత రంగస్థలంలో రామ్ చరణ్‌కు బ్రదర్ సెంటిమెంట్ ని యాడ్ చేసి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఇక ఈసారి బన్నీతో కలిసి సుకుమార్ ‘భార్య సెంటిమెంట్’ ని తాకాబోతున్నాడట. రష్మిక మందన్న అల్లు అర్జున్ భార్యగా కనిపించనుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయట. నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగస్థలం తారాగణం ప్రకాష్ రాజ్, జగపతి బాబు మరియు అనసూయ విభిన్న పాత్రల్లో నటించనున్నారు.