Tollywood: డైరెక్ట‌ర్ సుకుమార్ ఇంట ఒకే వేదిక‌పై మ‌హేశ్‌, తార‌క్‌..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఓణీ ఫంక్ష‌న్ గ‌త రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చి ఆమెను ఆశీర్వ‌దించారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు-న‌మ్ర‌త జంట‌, ఎన్టీఆర్‌-ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి జంట‌, నాగ‌చైత‌న్య-స‌మంత జంట ఈ వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.. అలాగే సాయితేజ్‌, వైష్ణ‌వ్‌తేజ్ త‌మ అమ్మ‌తో క‌లిసి ఈ వేడుక‌కు విచ్చేశారు.

Tollywood Celebrities

Tollywoodహీరో రామ్‌పోతినేని, హీరోయిన్స్‌ హెబ్బాప‌టేల్‌, అనుప‌మ‌, ‌‌లావ‌ణ్య‌, ఉప్పెన ఫేం కృతిశెట్టి , జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్‌, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ త‌‌దిత‌రులు ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. Tollywoodఇక సుకుమార్ ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ పుష్ప‌కు డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.