అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్

ఫిట్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆల్మోస్ట్ టాప్ హీరోలందరినీ కవర్ చేసిన ఈ ఢిల్లీ భామకి సాలిడ్ హిట్ మాత్రం దక్కట్లేదు. హిందీలో లక్ ట్రై చేసింది కానీ అక్కడ కూడా అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. 2009లో కన్నడ సినిమా గిల్లితో తెరపై మెరిసిన రకుల్, ఈ దశాబ్ద కాలంలో స్టార్ హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్ గా కనిపించింది కానీ స్పెషల్ రోల్స్ మాత్రం చేయలేదు. సినీ ప్రయాణం పదేళ్లు గడుస్తున్న సందర్భంగా రకుల్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.

rakul

ఇండస్ట్రీ వర్గాలకి కూడా షాక్ ఇస్తున్న రకుల్ కొత్త డెసిషన్ ఏంటంటే సినిమాలు తగ్గించడం. అవును రకుల్ సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకుంది. చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ.. `తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తగ్గించా. కావాలని కొన్ని అవకాశాలను వదులుకున్నా. ఎంతగా కష్టపడుతున్నా ఇటీవల సరైన ఫలితాలు రావడం లేదు. వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అందుకే కొంతకాలం సినీ రంగానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. ఇకపై, మంచి కథ, నచ్చిన పాత్ర అయితేనే సినిమాలు అంగీకరిస్తానని రకుల్ చెప్పింది. రకుల్ తీసుకున్న ఈ డెసిషన్ ఆమె అభిమానులని డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది.