‘వాలిమై’గా మారిన తల అజిత్ ‘AK60’

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కి ఉండే రేంజే వేరు. రజినీ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఏకైక హీరో అజిత్, ఈ ఇయర్ రెండు హిట్స్ ఇచ్చాడు. అందులో ఒకటి విశ్వాసం కాగా మరొకటి నెర్కొండ పార్వై. శ్రీదేవికి ఇచ్చిన మాట కోసం బోనీ కపూర్ బ్యానర్ లో నెర్కొండ పార్వై సినిమా చేసిన అజిత్ సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ దర్శకత్వంలోనే తన నెక్స్ట్ సినిమాని అజిత్ అనౌన్స్ చేశాడు. నెర్కొండ పార్వై నిర్మించిన బోనీ కపూర్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి.

AK60

పూజా కార్యక్రమాల్లో శ్రీదేవి పటానికి బోనీ నివాళులు అర్పించారు. #AK60 పేరుతో పాపులర్ అయిన ఈ సినిమాకి వాలిమై అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. వాలిమై అంటే బలం/స్ట్రెంగ్త్ అనే అర్ధం వస్తుంది. ఎంతో బలమైన కథ ఉంటేనే వాలిమై లాంటి టైటిల్ పెడతారు, అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కాబట్టే కథకి తగ్గట్లు వాలిమై టైటిల్ పెట్టినట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ వాలిమై సినిమాను 2020 సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేశారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.