ఆ పని చేయడం చాలా కష్టం

నవ్వడం ఓ భోగం నవ్వించడం ఓ యోగం నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు. అందుకే కామెడీ చేసిన వాడు ఏదైనా చేసి మెప్పించగలడు అంటారు. ఎవరు ఏ ఎమోషన్ ని అయినా పలికించారు గాని కామెడీని పలికించడం, దానితో ఎదుటివారిని నవ్వించడం అంత ఈజీ కాదు. ఈ విషయాన్నే స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే మరోసారి చెప్పింది. టాప్ యాక్ట్రెస్ గా స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీకి కామెడీ ఎందుకు కష్టం అనిపించింది అనుకుంటున్నారా?

పూజ ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ డైరెక్ట్ చేస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, స్టాండప్‌ కమెడియన్‌ వైభ పాత్రలో కనిపించనుంది. ఈ రోల్ ప్లే చేయడానికి చాలా కష్టపడ్డానని పూజా హెగ్డే చెప్పింది. మరి ఆమె కష్టానికి తగ్గ ఫలితం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూవీ ఇస్తుందేమో చూడాలి.