సోలో హీరోనా? మళ్లీ మల్టీస్టారరా?

కొత్త బంగారు లోకం సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల, నెక్ట్స్ సినిమాని స్టార్ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబుని ఒప్పించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. ఇద్దరు హీరోల ఇమేజ్‌ని డ్యామేజ్ చేయకుండా ఫ్యామిలీ డ్రామా సినిమాని తెరకెక్కించి విధానం అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత వచ్చిన క్లీన్ మల్టీస్టారర్ మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి పైసా వసూళ్లు చిత్రంగా నిలిచింది. దీంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సరైన హిట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవ్వడంతో డైరెక్టర్స్ గా ఆఫర్సే కరువయ్యాయి.. చాలా గ్యాప్ తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఈ ఫ్యామిలి మూవీస్ దర్శకుడు.

ఈ సారి ఎలాగైనా హిట్ కోట్టాలని కసితో ఉన్న శ్రీకాంత్ అడ్డాల, తన బలాన్నే నమ్ముకుంటూ మరోసారి మంచి ఫ్యామిలీ కథని సిద్ధం చేశాడట. హ్యూమన్ ఎమోషన్స్ బాగా ఉన్న కథ కావడంతోనే గీత ఆర్ట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చారని సమాచారం. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ అన్నీ సెట్ అయితే నాని ఈ మూవీలో హీరోగా నటించే అవకాశం ఉందట. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకుంటే శ్రీకాంత్ అడ్డాల మరో మల్టీస్టారర్ కథ కూడా రాశాడని ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్, టాలీవుడ్ సీనీయర్ హీరో విక్టరీ వెంకటేష్ నటింపజేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కె ఈ సినిమాకు కూచిపూడి వారి వీధి అనే టైటిల్ పరిశీలుస్తున్నారట.మరి ఈ సినిమాతో అయిన దర్శకుడిగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేడో చూడాలి…