ధనుష్, వెట్రిమారన్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ అసురన్. విలేజ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్లు రాబట్టింది. ఇదే మూవీని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయనున్నట్లు సురేశ్ బాబు అనౌన్స్ చేశాడు. థానుతో కలిసి నిర్మిస్తున్న ఈ అసురన్ రీమేక్ కి డైరెక్టర్ ఎవరు అనే మాటపై మాత్రం క్లారిటీ లేదు. ముందుగా అసురన్ తెలుగు వెర్షన్ కి ఓంకార్ దర్శకత్వం వహిస్తాడనే మాట వినిపించినా, అతని ప్లేస్ లో టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఫైనల్ అయ్యాడనే న్యూస్ బయటకి వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు దర్శకులు కూడా అసురన్ చేయట్లేదని తెలుస్తోంది.
ఓంకార్, హనుని కాదని సురేష్ బాబు అసురన్ సినిమాని తీసుకెళ్లి శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టాడని సమాచారం. వెంకటేశ్ ని సీతమ్మ వాకిట్లో సినిమాతో డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి, ఈ ఆఫర్ లైఫ్ ఇచ్చేదే. హ్యూమన్ ఎమోషన్స్ ని, ఫ్యామిలీ బాండింగ్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడు కాబట్టే అసురన్ సినిమా శ్రీకాంత్ అడ్డాల చేతికి వెళ్లిందని సమాచారం. అయితే ఫ్యామిలీ సినిమాలనే తీసిన శ్రీకాంత్ అడ్డాల, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉన్న కథని… ఫాస్ట్ ఫేజ్ లో నడిచే కథని ఎలా డైరెక్ట్ చేస్తాడు? వెట్రిమారన్ సినిమాకి ఎంత వరకూ న్యాయం చేస్తాడు అనేది చూడాలి.