రాశి ఖన్నా, తేజ్ ని బ్రతిమాలేస్తుంది… పెళ్లికి ఓకే అంటాడా?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండగే. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మారుతీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకి వచ్చిన టైటిల్ సాంగ్, మూవీ మూడ్ ని కన్వే చేస్తూ మెగా అభిమానులని మెప్పిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓ బావ అంటూ సాంగ్ ని రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ మధ్య డిజైన్ చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. ఓ బావా మా అక్కని పెళ్లాడేస్తావా అంటూ సాగిన ఈ సాంగ్ వినగానే అట్రాక్ట్ చేసింది.

ప్రతి రోజు పండగే సినిమాలో తేజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎన్ని షేడ్స్ ఉండబోతున్నాయి అనేది ఈ సాంగ్ తోనే చెప్పే ప్రయత్నం చేశారు. హ్యూజ్ కాస్ట్ తో, గోదావరి అందాల మధ్య యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ప్రతి రోజు పండగే సినిమాకి మరింత కల తెచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ఇస్తున్న థమన్, మరోసారి క్లీన్ చార్ట్ బస్టర్ ఇచ్చాడు. కేకే రాసిన ఇంగ్లీష్ అండ్ తెలుగు లిరిక్స్ కి సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజల వాయిస్ బాగా యాప్ట్ అయ్యాయి. ఈ లిరికల్ సాంగ్ లో చూపించిన మేకింగ్ వీడియోస్ కూడా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో చూపించారు.