సరిలేరు నీకెవ్వరూ టీజర్ రిలీజ్, అతనికి అంకితం…

సంక్రాంతి టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకి రానున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రొమోషన్స్ స్పీడ్ పెంచనున్నాడు. ఇప్పటికే పోస్టర్స్ తో మెప్పించిన సరిలేరు నీకెవ్వరూ టీం, త్వరలో టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే టీజర్ రిలీజింగ్ సూన్ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది కాబట్టి ఘట్టమనేని అభిమానులు, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

sarileru neekevvaru teaser release date

అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ని, అతని పుట్టిన రోజునే రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రిపేర్ అవుతోంది. ఈ నెల 23న అనిల్ రావిపూడి బర్త్ డే ఉంది, డైరెక్టర్ కి డేడికేట్ చేస్తూ సరిలేరు నీకెవ్వరూ టీజర్ ని అదే రోజున విడుదల చేయనున్నారు. అంటే మరో అయిదు రోజుల్లో ఘట్టమనేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ త్వరలో ఒక పోస్టర్ కూడా బయటకి రానుంది. గత కొంతకాలంగా మహేశ్ సీరియస్ సినిమాలు మాత్రమే చేస్తుండడంతో, అతనిలో ఉన్న ఫన్నీ సైడ్ ని డైరెక్టర్స్ పక్కన పెట్టేశారు. అనీల్ రావిపూడి మాత్రం మహేశ్ బాబుని 25 సినిమాల్లో చూపించని విధంగా ప్రెజెంట్ చేయనున్నాడు. ఇన్ని రోజులు మహేశ్ ఫ్యాన్స్ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్, వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సరిలేరు నీకెవ్వరూ టీం రెడీగా ఉంది. దాన్ని శాంపిల్ గా చూపించడానికే టీజర్ ని వదులుతున్నారు. పోస్టర్స్ వస్తేనే సోషల్ మీడియాని షేక్ చేసిన ఘట్టమనేని అభిమానులు, టీజర్ ని ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.