మరోసారి హిట్ సినిమాపై మనసు పారేసుకున్న అక్కినేని హీరో

తెలుగులో రీమేక్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. టాప్ హీరోస్ అందరూ ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలని తెలుగులో చేస్తుంటే, తానేం తక్కువ కాదు అనుకున్నాడో ఏమో కానీ అక్కినేని హీరో నాగ చైతన్య కూడా రీమేక్ కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మలయాళ ప్రేమమ్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన చై, ఇప్పుడు బాలీవుడ్ సినిమా చిచోరెని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

బాలీవుడ్ లో చిన్న చిత్రంగా తెరకెక్కి, సూపర్ హిట్ అయిన చిచోరే సినిమా విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది. ఆమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చించోరే. సుశాంత్ సింగ్, నవీన్ పోలిశెట్టి, శ్రద్ధ కపూర్ నటించిన ఈ సినిమా నూట యాభై కోట్లు రాబట్టి చిన్న సినిమాల సత్తా చాటింది. కథలో అన్ని ఎమోషన్స్ ఉండడంతో నాగ చైతన్య, దీన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం డిస్కషన్స్ స్టేజ్ లోనే ఉన్న ఈ సినిమా ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.