నిర్మాత ”సి. శ్రీధర్ రెడ్డి” ఇకలేరు!!

‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్‌ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు.ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో “సోగ్గాడి కాపురం”, వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా “బాలరాజు బంగారు పెళ్ళాం” సినిమాలను నిర్మించారు. సహృదయులు. ఆయన లేని లోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు.