బయోపిక్‌లో నటించనున్న రియల్ హీరో

తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ దివంగత ఉమేశ్ చంద్ర గురించి తెలియనివారుండరు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్‌లో ఉన్నవారికి ఆయన గురించి ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే SR నగర్‌లో ఆయన విగ్రహం ఉంటుంది. 1999 సెప్టెంబర్ 4వ తేదీన ఆయనను SR నగర్‌లో నడిరోడ్డుపై నక్సలైట్లు కాల్చి చంపేశారు. ఆయన ఎక్కడ అయితే మరణించారో… ఆ ప్లేస్‌లోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.

SONUSOOD IN UMESH CHANDRA

అయితే ఉమేష్ చంద్ర జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ సినిమా త్వరలో తెరకెక్కనుంది. ఇందులో రిలయ్ హీరో సోనూసూద్ ప్రధాన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఇటీవలే మేకర్స్ సోనూసూద్‌కి కథ చెప్పగా.. సోనూసూద్ కూడా ఇందులో నటించేందుక ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.