Tollywood: ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉప్పెన ట్రైల‌ర్‌.. విజ‌య్‌సేతుప‌తి, వైష్ణ‌వ్ తేజ్ డైలాగ్స్ అదుర్స్‌!

Tollywood: మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ఉప్పెన‌. తాజాగా ఈ చిత్ర‌ ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా చిత్ర‌బృందం రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలుపుతూ.. ఉప్పెన ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ బ్ర‌ద‌ర్ అంటూ ట్విట్ట‌ర్‌లో ఉప్పెన ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

uppena trailer

Tollywood ప్రేమ అంటే ఓ లైలా మ‌జ్నులా దేవ‌దాసు పార్వ‌తీలా ఓ రోమియో జూలియోట్‌లా.. అదో మాదిరిలా ఉండాలిరా.. ఒరేయ్ తాలింపు బ‌స్సు ఊర్లోకి వ‌చ్చేస్తుందురా అంటూ వైష్ణ‌వ్ చెప్పె డైలాగ్‌తో ఈ చిత్ర ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వ్వ‌గా, ఎంత‌గానో అల‌రిస్తుంది. అలాగే అబ‌ద్ధం అడితేనే ఆడ‌పిల్ల‌లు పుడతారు అంటే.. మ‌రీ ఇంతా అంద‌గ‌త్తే పుట్టిందంటే ఈ అమ్మాయి బాబు మ‌ర్డ‌ర్ చేశాడారా అంటూ వైష్ణ‌వ్ తేజ్ చెప్పే డైలాగ్‌తో ఎంట్రీ ఇస్తాడు విజ‌య్ సేతుప‌తి. Tollywood దీంట్లో విజ‌య్ సేతుప‌తి న‌ట‌న ఎంతో క్రూరంగా ఉంటుందో చూపించారు. ప్రేమ గొప్ప‌దైతే.. చ‌రిత్ర‌లోనే స‌మాధులోనే క‌ల‌పాల‌ని గానీ, పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌ను క‌ని ఇళ్లలో క‌న‌ప‌డితే దాన్ని విలువ త‌గ్గిపోదు. అందుకే ప్రేమ ఎప్పుడు చ‌రిత్ర‌లోనే ఉంటాది.. దానికి భ‌విష్య‌త్తు ఉండ‌దు ఏంటీ అంటూ విజ‌య్ సేతుప‌తి చెప్పే డైలాగ్ మ‌రీ వైలంట్‌గా ఉంటుంది. Tollywood ఇక ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ ప్రేమ క‌థా చిత్రానికి బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇందులో విల‌న్‌గా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి పోషించాడు.. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా.. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానుంది ఉప్పెన చిత్రం.