తొలి సినిమా: 25న థియేటర్లలోకి SBSB

మెగా హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో సాయిధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

SOLOBRATUKEY SO BETTER

ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా… లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి స్టార్ హీరో సినిమా ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం కరోనా కాలంలో థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందా?.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు.