‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

‘గతం’ మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు.

GATHAM

భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు జనవరి 17న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్‌లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని సంపాదించుకుంది.

ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ఒక ప్రధాన భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఒక కొత్త సినిమా అయిన గతంకు అవకాశం దక్కడం గొప్ప అని చెప్పుకోవాలి.