సినిమా హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం ‘బన్నీ VOX’!!

ఈ రోజుల్లో చాలా మంది నటీనటులు సోషల్ మీడియాలో తమ ప్రతిభను నిరూపించుకుని టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న కొంతమంది యంగ్ టాలెంటెడ్ పీపుల్స్ పై సినీ ప్రముఖులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక టిక్ టాక్ అలాగే ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న బన్నీ వోక్స్ అని పిలువబడే అందమైన వర్షిన్నే సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

అందమైన హావభావాలతో అప్పట్లో టిక్ టాక్ లో బాగా క్లిక్కయిన ఈ బ్యూటీ ఇప్పుడు చేధన్ చీను సరసన మధు మదాసు తెరకెక్కిస్తున్న విద్యార్తి చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. తిరుపతికి చెందిన 18 ఏళ్ల బన్నీ VOX ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఇప్పుడు సినిమాల్లో ఉండటానికి ఇదే సరైన సమయం అంటూ ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరణ ఇచ్చారు. ఈ పరిశ్రమలో నేను సాధించడానికి ఇంకా చాలా ఉందని అలాగే చలనచిత్రాలలో నటించక ముందే ఇంత బలమైన అభిమానులు ఉన్నందుకు ఎంతగానో ఆశ్చర్యపోతున్నట్లు వర్షిన్నే తెలిపారు.