ఇక నుంచి ’10’వ తరగతిలో ‘ఎన్టిఆర్’ పాఠం!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను భవిష్యత్తు తారలకు కూడా తెలియజెప్పాలని తెలంగాణ విద్యాశాఖ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నటుడిగా జనాల మన్ననలను పొంది ఆ తరువాత తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్.

ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉండి చిరకాలం గుర్తుండిపోయే మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం అనే కార్యక్రమాలతో ఒక చారిత్ర సృష్టించారు. తారకరామారావు జీవితంలో ఎన్నో మంచి అంశాలు ఉన్నాయని ఇక నుంచి తెలంగాణ 10వ తరగతి సాంఘీక శాస్త్రంలో ఆయన జీవిత చరిత్రను ఒక పాఠంగా మార్చారు. 268పేజీలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచారు. ఢిల్లీ ఆధిపత్య రాజకీయాలకు ఎదురపడి తెలుగు ప్రజలను ఏకం చేసిన రామారావు 1982లో పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే సీఎం సీటు అందుకున్నారు