‘సుశాంత్’ కేసులో మరో ట్విస్ట్.. ‘రియా’ ఇంటిపై నార్కోటిక్స్ రెయిడ్!!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట నెపోటిజమ్ ఆ తరువాత రియా చక్రవర్తి, ఇక ఇప్పుడు డ్రగ్స్ లీక్స్ బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఎవరు ఊహించని విధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇంటిపై శుక్రవారం ఉదయం రెయిడ్ నిర్వహించింది.

రియా నివాసం లోపల 8 మంది ఎన్‌సిబి సభ్యులు అలాగే పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్‌ల ఆధారంగా ఇటీవల కొన్ని విషయాలు బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఆరోపించిన ‘డ్రగ్ లింక్’ ఆధారాల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. రియా సోదరుడు షోయిక్ చక్రవర్తి యొక్క ల్యాప్‌టాప్‌లు మరియు హార్డ్ డ్రైవ్‌లు ఎన్‌సిబి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. అలాగే మరోవైపు సీబీఐ అధికారులు కూడా కేసు విషయంలో కీలక ఆధారాలను సేకరించేందుకి త్వరలోనే మరోసారి రియాను విచారించే అవకాశం ఉన్నట్లు టాక్.