Sunitha: మాల్దీవుల్లో సునీత లేటెస్ట్ లుక్ వైర‌ల్‌..

Sunitha: ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత, మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీర‌ప‌నేనిని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న విష‌చ‌యం తెలిసిందే. ఇక ఈ నూత‌న దంప‌తులు ప్ర‌స్తుతం మాల్దీవుల్లో బిజీగా ఉన్నారు. టూర్‌లో భాగంగా ఆమె అక్క‌డ తీసుకున్న ఫోటోను ప్రేమికుల రోజున సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో Sunitha సునీత యంగ్ లుక్‌లో క‌నిపించింది. దీంతో నెటిజ‌న్ల‌ను ఎంతో ఆక‌ర్షిస్తుంది.

మాల్దీవుల్లో స‌ముద్ర అందాలతో ఆమె జాలీగా గడుపుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌తుంది. ఇదిలాఉంచితే.. Sunithaసునీతా-మ్యాంగో రామ్ వీరిద్ద‌రు స్నేహంతో మొద‌లై పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌న‌వ‌రి 9న అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ప‌లువురు సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ‌ప్ర‌ముఖులు హాజ‌రై వీరిద్ద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు.