పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మెహ్రీన్

మెహ్రీన్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నారు. ఇందుకోసం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లు వెల్లడించారు. ‘రెండేళ్ల నుంచి ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రయత్నిస్తున్నా. ఇప్పటికి పూర్తైంది. ఈ విషయం అందరికీ చెప్పాలా? వద్దా? అని ఆలోచించా. కానీ కొంతమంది మహిళల కోసం ఈ విషయం బహిర్గతం చేస్తున్నా’ అని చెప్పారు. కాగా ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటే ఆరోగ్యకరమైన అండాలను భద్రపరుచుకుని కావాల్సినప్పుడు పిల్లలను కనొచ్చు.

కృష్ణగాడి వీర ప్రేమగాద, మంచి రోజులొచ్చాయి, పంతం, చాణక్య, మహానుభావుడు వంటి మరెన్నో తెలుగు సినిమాలలో ఈ హీరోయిన్ నటించిన విషయం అందరికి తెలిసిందే.