అది అంత ఫేక్ న్యూస్ : నటి హేమ

బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తలను టాలీవుడ్ నటి హేమ ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె.. ‘ఇక్కడ ఓ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నా. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇందులోకి అనవసరంగా నన్ను లాగుతున్నారు. నా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని స్పష్టం చేశారు.

అయితే బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ తీసుకున్నారని ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన రైడ్‌లో పోలీసులు గుర్తించారు.