అతను నా ప్రయివేట్ పార్ట్ పై ‘టచ్’ చేయాలని చూశాడు: ‘షేర్లిన్ చోప్రా’

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ షేర్లిన్ చోప్రా కూడా అదే తరహాలో ఒక టాలెంట్ ఏజెన్సీ అధినేత కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచాలన ఆరోపణలు చేసింది.

షేర్లిన్ మాట్లాడుతూ నేనీ అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పలు ఇనిస్టిట్యూషన్స్ కి కూడా వెళ్ళాను. అయితే ఫేమస్ క్వాని టాలెంట్ ఏజెన్సీ సహా భాగస్వామి అనిర్బన్ నా వృక్షోజాలపై చాలా అసభ్యంగా కామెంట్ చేశాడు. ఎవరు లేనప్పుడు రూమ్ లోకి పిలిచి కింద నుంచి పైకి చూశాడు. నేను సందేహంతో డ్రెస్ ఏమైనా బాగోలేదా అని అడుగాను. కానీ అతను నా వృక్షోజాలు నిజమైనేవానా అంటూ కామెంట్ చేశాడు. అంతే కాకుండా వాటిని టచ్ చేయవచ్చా అని అడిగాడు. నిజంగా అతను అడిగిన విధానం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఒక మహిళతో ఎవరైనా అలానే మాట్లాడతారా? అనుకున్నా. అవి నిజమైనవి అయినా కాకపోయినా ప్రాబ్లమ్ ఏంటి? నిజంగా ఛాన్సులు కోసం ఎదురుచూసే వారిని ఇలానే చూస్తారని షేర్లిన్ ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.