‘షకీలా’ బయోపిక్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

షకీలా.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు తన సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది షకీలా. సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో శృంగార సన్నివేశాలతో కుర్రోళ్లను అలరించింది. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది షకీలా. ఒకప్పుడు స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న షకీలాకి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తోంది.

shakeela biopic
shakeela biopic

అయితే ఒకప్పుడు స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా ‘షకీలా’ పేరుతో ఒక బయెపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ కన్పామ్ చేశారు. డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంద్రజిత్ లంకేష్ ఈ సినిమాను తెరకెక్కించగా.. హిందీతో పాటు పలు భాషల్లో దీనిని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా.. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. షకీలా అసలు శృంగార సీన్లలో నటించలేదని, కొన్ని సినిమాల్లో ఆమె ఫేస్ వాడుకుని గ్రాఫిక్స్ చేశారనే విధంగా ట్రైలర్‌లో చూపించారు. ఇక సిల్క్ స్మిత మరణం తర్వాత షకీలా వెలుగులోకి వచ్చిందనేలా ట్రైలర్‌లో చూపించారు.