మా ఎన్నికలని అసలు ఎవడు ప్రకటించాడు- కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు…

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్యానెల్ మెంబెర్స్ ని కూడా అనౌన్స్ చేశాడు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కన్నడ అతను ప్రెసిడెంట్ గా ఉండడం ఏంటి అనుకుంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మా అసోసియేషన్ లో గొడవలు ఈరోజు కొత్త కాకపోయినా కూడా ఈసారి నాన్ లోకల్ ఆనే మాట ఆర్టిస్టులని విడగోడుతోంది. ప్రకాశ్ రాజ్ పోటీ చేయడం ఇండస్ట్రీ పెద్దలకు ఇష్టం లేదు అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఈ రగడపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు.

‘మా ఎన్నికలను అసలు ఎవరు ప్రకటించారు? ఇప్పుడున్న కమిటీ పదవీకాలం పూర్తైందా? వారే ఎన్నికలను ప్రకటించారా? కొత్తగా ఓ ప్యానెల్ అంటూ ప్రకటించారు. ఇదే నాకు కొపం తెప్పించింది. దీనిపై ఇప్పుడు కాదు.. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతిచ్చారో లేదో నాకు తెలీదు.. కానీ మా పై నాగబాబు వ్యాఖ్యలు సరికాదు’ అని అన్నారు. నటులకు భాషా బేధం ఉండదు.. నిజమే..! కానీ.. పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థలు, పాలకమండలిపై ఇతర భాష నటులకు అధికారం ఉండద్దొనేది చాలామంది ఉద్దేశం. మంచు విష్ణు, హేమ, జీవిత, జీవీఎల్ కూడా పోటీ చేస్తున్న ఈ ఎన్నికలు ముందెన్నడూ లేనంత కంట్రావర్సిగా మారుతున్నాయి. మరి ఈ రసవత్తర ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అండ్ విష్ణుల మధ్య గట్టి పోటీ ఉండనుంది. వీరిలో అధ్యక్ష పదివి ఎవరికి దక్కబోతుందో చూడాలి.