సోడా సెంటర్ మాస్ ఇమేజ్ ఇస్తుందా?

కథలో విషయం ఉండే సినిమాలనే ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో సుధీర్ బాబు, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్స్ లో సుధీర్ బాబు ద్రుష్టి అంతా శ్రీదేవి సోడా సెంటర్ పైనే ఉంది. పలసా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అభిమానులని ఆకట్టుకుంది.

ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. గోదారి నేపథ్యంలో రానున్న ఈ మూవీలో సుధీర్ బాబు గుబురు గడ్డం, మీసం, బాగా పెరిగిన జుత్తుతో కంప్లీట్ మాసీ లుక్ తో కనిపిస్తున్నాడు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. వి మూవీతో యాక్షన్ హీరోగా మెప్పించిన సుధీర్ బాబు, ఈ శ్రీదేవి సోడా సెంటర్ తో సాలిడ్ హిట్ కొట్టి మాస్ ఆడియన్స్ కి దెగ్గర అవ్వాలని చూస్తున్నాడు.