తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కరోనా ప్రభావం క్రమంలో లాక్‌డౌన్ వల్ల మార్చి నుంచి స్కూళ్లు మూతపడగా.. విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నారు. కానీ చాలామంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులు వినడం కష్టంగా మారింది.
కానీ ఇప్పుడు కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి, ఆ పైన తరగతుల విద్యార్థులకు స్కూళ్లు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ప్రగతిభవన్‌లో విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు.