మొక్క‌లు నాటిన బిగ్‌బాస్‌-4ఫేం సుజాత‌!

బిగ్‌బాస్‌-4 ఫేం సుజాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్క‌లు నాటింది. వివ‌రాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్న క్ర‌మంలో ప‌లు రంగాల ప్ర‌ముఖు‌లు విరివిగా మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణ స్ఫూర్తిని చాటుతున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా న‌టుడు నోయెల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి నేడు జూబ్లీహిల్స్‌లో మొక్క‌లు నాటారు ప్ర‌ముఖ యాంక‌ర్‌, బిగ్‌బాస్‌-4 ఫేం సుజాత. ఈ సంద‌ర్భంగా సుజాత మాట్లాడుతూ..

bigboss fame sujatha

తెలంగాణ సీఎం కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారంతో ప‌చ్చ‌ద‌నం పెరిగి వాన‌లు రావాలని, కోతులు అడ‌వుల‌కు వాప‌స్ పోవాల‌ని ఉద్దేశ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతంగా ముందుకు కొన‌సాగుతుంద‌ని ఆమె తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటినందుకు త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అనంత‌రం ప్ర‌ముఖ జాన‌ప‌ద సింగ‌ర్ మంగ్లీ, మోనాల్‌, స్వాతి దీక్షిత్‌ల‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చింది.